Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఈనెల 19న తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ప్రథమవర్థంతిని జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక మల్లు వెంకటనర్సింహారెడ్డి భవన్లో జరిగిన పార్టీ సూర్యాపేటరూరల్, త్రీటౌన్కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈనెల 19న మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సందర్భంగా ప్రతి శాఖ ఉన్న అన్ని గ్రామాలలో ,మండల, పట్టణ కేంద్రాల్లో ప్రధమ వర్ధంతి సభలు ఘనంగా నిర్వహించాలని కోరారు. నాటి వీర తెలంగాణ విప్లవ పోరాటంలో మల్లు స్వరాజ్యం నిర్వహించిన పాత్ర మరువలేనిదన్నారు.లిందన్నారు. మల్లు స్వరాజ్యం స్ఫూర్తితో పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా ,కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 17 నుండి 29 వరకు రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా జన చైతన్యయాత్రలు నిర్వహిస్తామన్నారు.కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ధరలు విపరీతంగా పెంచుతూ పేద,మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం మోపుతుందన్నారు.దళితులు, మైనార్టీలు, క్రిస్టియన్స్‌పై బీజేపీ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూ మత సామరస్యాన్ని మంటగల్పుతోందన్నారు. దేశంలో ఉన్న సంపదను మొత్తం అంబానీ, అదాని వంటి పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతూ ప్రభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తుందని విమర్శించారు.లాభాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను సైతం కార్పొరేట్‌శక్తులకు అక్రమంగా అప్పనంగా కట్టబెడుతుందని విమర్శించారు.రైతాంగం పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందన్నారు.కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.ఇటీవల ప్రకటించిన బడ్జెట్లో ఉపాధిహామీ చట్టానికి కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేవరకు అలిపెరుగని ప్రజాపోరాటాలు నిర్వహించాలని కోరారు.పార్టీ సీనియర్ నాయకులు చెరుకు సత్యం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ(ఎం) 3 టౌన్ కార్యదర్శి మేకనబోయిన శేఖర్, సూర్యాపేట రూరల్ కార్యదర్శి మారం చంద్రారెడ్డి, జిల్లా కమిటీ సభ్యురాలు మేకనబోయిన సైదమ్మ, మండల, పట్టణ కమిటీ సభ్యులు మందడి రాంరెడ్డి, పందిరి సత్యనారాయణరెడ్డి, నారాయణ వీరారెడ్డి, నంద్యాల కేశవరెడ్డి, కామల్ల లింగయ్య, తీగల లింగయ్య, నాగిరెడ్డి శేఖర్‌రెడ్డి, రెడ్డి మోహన్‌రెడ్డి,గండమల్ల సోందు, నల్లమేకల అంజయ్య, నోముల ధనమూర్తి,జలగం సత్తయ్య పాల్గొన్నారు.