Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-మఠంపల్లి
సూర్యాపేట జిల్లాలో అటవీ హక్కుల చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న 4,200 మంది గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కుపత్రాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లు నాగార్జునరెడ్డి అన్నారు. ఆదివారం తెలంగాణ గిరిజన సంఘం గిరిజన చైతన్యయాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకు, జిల్లాస్థాయి అధికారుల చేతలకు పొంతన లేదన్నారు. రాష్ట్రంలో అడవి హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్న 12 లక్షల మందికి అటవీ భూములపై హక్కులు కల్పించాలి. హక్కు పత్రాలకోసం దరఖాస్తు చేసుకున్న ఎస్డీఎల్సీడీఎల్సీ సమావేశంలో కేవలం 84 మందికి 83 ఎకరాల భూమిపై హక్కులు ఇస్తున్నట్లు తీర్మానించారన్నారు. డివిజనల్ లెవెల్ కమిటీ ఎస్డీఎల్సీ, డీఎల్సీ సభ్యులుగా ఉన్న గిరిజన ప్రజాప్రతినిధులు జిల్లా అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి, హడావుడిగా తీర్మానాలు పూర్తి చేయడంతో గిరిజనులు అటవీ హక్కుల పొందలేక నష్టపోతున్నారని తెలిపారు. అటవీ అధికారులు ఇష్టాను సారంగా సాటిలైట్ ఏవీ డేస్ దశాబ్దాలుగా పోరాడుతున్న గిరిజనుల పోరాటానికి చులకన చేయాలని చూస్తే ప్రభుత్వం పునాదులు కదిలిపోతాయని చెప్పారు. దరఖాస్తు చేసుకున్న గిరిజనులందరికి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధీరావత్ రవి నాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాలోతు బాలు నాయక్, బానోతు రాజేందర్ నాయక్, రాష్ట్ర నాయకులు భూక్య పాండు నాయక్, మాలోతు నాగానాయక్, శీనునాయక్, రాష్ట్ర కమిటీ సభ్యుడు పల్లె వెంకటరెడ్డి, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నగరపు పాండు, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సైదులు, జిల్లా ఉపాధ్యక్షులు శీలం శీను, మండల కన్వీనర్ రన్ మియా, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు ఎస్.జగన్మోహన్రెడ్డి, బీ.శంబయ, వీరమల్లు, హుజూర్నగర్ మండల కార్యదర్శి పోసబోయిన హుస్సేన్, వినోద్నాయక్, వాలీబారు, మాంగో నాయక్, శీనునాయక్, సైదులు, కంటుకోటయ్య తదితరులు పాల్గొన్నారు.