Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్ టౌన్
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 సంవత్సరాల కాలంలో కార్మికులపై అనేక వేధింపులు చేస్తున్నారని, అందుకే ఐక్య పోరాటాలకు సిద్దంకావాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని అమరవీరుల భవనంలో నిర్వహించిన సీఐటీయూ మండల మహాసభలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మిక చట్టాలు 29 ఉంటే నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకువచ్చి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్పిడి చేశారని విమర్శించారు. కార్మికులు అనేక రంగాల్లో పనిచేస్తున్న వారికి రక్షణ కల్పించే ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్ అమలు చేయడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయన్నారు. కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాల చట్టాలను కార్మికులకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు వట్టెపు సైదులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోసనబోయిన హుస్సేన్, సీఐటీయూ నాయకులు సురభి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. అనంతరం మండల నూతన కమిటీని 13 మందితో ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీలం శ్రీను, కొప్పుల వీరారెడ్డి, అలవాల కొండలు, పొదిల్ల నాగరాజు, చలి కంటి శ్రీను, లక్కమల్ల రత్నం, షేక్ గౌస్, ప్రసాద్, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, ఎల్లమ్మ, నూకల రంగారెడ్డి ,గోపుల పుల్లయ్య ,అంజయ్య తదితరులు పాల్గొన్నారు.