Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
మండలకేంద్రంలో జరగబోయే హత్ సే హత్ జోడో కార్యక్రమం విజయవంతం చేయుటకు ముఖ్య నాయకులతో ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎలిసోజు నరేష్ మాట్లాడారు. రాహుల్‌గాంధీ పిలుపు మేరకు దేశంలో,రాష్ట్రంలో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాల తీరును గడపగడపకు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు.గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసిన పథకాలను గుర్తు చేస్తూ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం తోటే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందనే విశ్వాసం కల్పించాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, కేవలం రూ.500లకే గ్యాస్ సిలిండర్, ఫీజురీయీ ంబర్స్‌మెంట్, పంటలకు గిట్టుబాటు ధర, ఆరోగ్య భద్రత, యువతకు ఉద్యోగ అవకాశాలు, ధరణి పోర్టల్ రద్దు, రైతులతో పాటు రైతులకు కూడా రైతుబంధు ఒకే ఇంట్లో ఇద్దరికి పింఛన్లు సబ్సిడీ రుణాలు, ఇంటి నిర్మాణం కోసం రూ.7 లక్షలతో ఉచిత విద్య ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలుకు వస్తాయని ప్రజలకు సవివరంగా ప్రతి ఒక్కరికి చెప్పాలని కోరారు.బీఆర్ఎస్ ఒక చేయితో సంక్షేమ ఫలాలు ఇస్తూ మరో చేయితో వివిధ రకాల పన్నుల ద్వారా లాక్కుంటుందన్నారు.మూడు లక్షల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఎలా సాధ్యమవుతుందని ఫ్రశ్నించారు.నియోజకవర్గానికి కేవలం 3000 ఇండ్లు కేటాయించడం ఎంతవరకు సమంజసమన్నారు.ఈ సమావేశంలో బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షులు పాలకుర్తి రాజయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు గంటా అమరేందర్‌రెడ్డి, గుండెపురి ఎంపీటీసీ ధరావత్ జుమ్మిలాల్, సర్పంచులు రామోజీ, ప్రేమ్ ప్రసాద్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లాక్య, నాయినినర్సన్న, పులిమామిడి యాదగిరి, బోనస్ పరుశరాములు, ఎస్టీ సెల్ చైర్మెన్ గుగులోతు రాజు, మండల నాయకులు కన్నెబోయిన మల్లయ్య, రాములునాయక్, సుధాకర్, గ్రామశాఖ అధ్యక్షులు గజ్జి లింగన్న, నాయిని కష్ణ, బాలకష్ణ, కుర్ర శీను, మహేష్, రామ్‌సింగ్, దండుగుల యాదగిరి, కడారి మల్లేష్, దూపటి అశోక్, చిలుకలమధు, తరుణ్, తదితరులు పాల్గొన్నారు.