Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుషుని విజయంలో స్త్రీ పాత్ర విలువైనది
- అందరికీ విద్యనందించాలనే గురుకుల విద్యాలయాల ఏర్పాటు
- తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించేలా వివిధ బీసీ సంఘాలకు నిర్మిస్తున్న ఆత్మగౌరవభవనాలు ఆయా కుల వత్తులను ఆధునికరించేలా తమ జాతి అభివద్ధికి పరిశోధన కేంద్ర బిందువులు కావాలని, సష్టికి మూలం స్త్రీ అలాంటి మహిళా మణులను గౌరవించేలా సత్కారం చేయటం అర్షనీయమని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో పనిచేస్తున్న విశ్వబ్రాహ్మణ మహిళలకు ఆదివారం నల్గొండలోని హైదరాబాదు రోడ్డులో గల విశ్వకర్మ భవన్లో అందించిన విశిష్ట సేవా పురస్కారాల మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రచురణతో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. సమాజానికి నాగరికత నాగరికతతో పాటు ఎన్నో అంశాలను తెలిపిన మూలపురుషుడు విశ్వకర్మ అని తెలిపారు. విశ్వబ్రాహ్మణ వంశీయులైన విశ్వకర్మ స్త్రీ శక్తిని గౌరవిస్తూ 48 మంది మహిళలకు సన్మానం చేయడం బహత్తర కార్యక్రమం అని కొనియాడారు. చదివే ప్రపంచ జ్ఞానాన్ని నేర్పిస్తుందనే సంకల్పంతో బీసీ కులాల పిల్లలు ఉన్నత చదువులు చదివేలా కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో బోధన సాగిస్తుందన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రభుత్వం మహిళా కళాశాల ఘట్కేసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దాసోజు పద్మావతి మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి మహిళా విశిష్టత నేటి యువతరం పాటించాల్సిన అంశాలను కండ్లకు కట్టినట్టు వివరించారు. వేడుకల్లో చిన్నారులు చేసిన శాస్త్రీయ సంస్కతిక నత్య ప్రదర్శనలు హావుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు విశ్రాంత సూపరిండెంట్ కష్ణమాచారి చిన్నారులను అభినందించి నగదు బహుమతులను అందజేశారు. అనంతరం వివిధ రంగాల్లో పనిచేస్తున్న 48 మంది మహిళలను ఉద్యోగులను ఘనంగా సన్మానించి జ్ఞాపికతో పాటు సర్టిఫికెట్లను అందజేశారు. సభలో స్వాగత ఉపన్యాసాన్ని. అసిస్టెంట్ ప్రొఫెసర్ విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రచార కార్యదర్శి బొడ్డుపల్లి రామకష్ణ వివరించారు. విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి పెందోటి సోము మాట్లాడుతూ సేవా సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఉద్దేశము ఇతర అంశాలను నివేదికను సభకు తెలియజేశారు . విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు దాసుజు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ మారోజు నందకుమార్ ఆచారి, కొండోజు పుల్లయ్య, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ మహిళా కార్యవర్గ సభ్యులు పర్వతం శోభారాణి, విశిష్ట అతిథులు సినిమా డైరెక్టర్ సూరోజు మంజుల తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సొల్లేటి పద్మ, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ బోధనకు సుమతి, అధ్యాపకురాలు కుచ్చెలకంటి పద్మజ, బీబీనగర్ అనురాధ, డాక్టర్ క్రాంతి, ప్రముఖ సిద్ధాంతి బేతోలు సత్యనారాయణ, తెలంగాణ గిడ్డంగుల శాఖ రీజినల్ మేనేజర్ అద్దంకి కష్ణమాచారి, లైన్స్ క్లబ్ గోల్డ్ అధ్యక్షుడు కొల్లోరు శేఖర్, విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ కార్యవర్విశ్వబ్రాహ్మణ సేవా సంస్థ నిర్వాహకులు దాసోజు బ్రహ్మచారి, తదితరులు పాల్గొన్నారు.