Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కతిక శాఖ, మిర్యాలగూడ సాంస్కతిక శాఖ కళాకేంద్రం సంయుక్త నిర్వహణలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పద్య సాంఘిక నాటిక పోటీలు ఆకట్టుకుంటున్నాయి. మూడో రోజు ఆదివారం నాటిక పోటీలు కొనసాగాయి. ఈ పోటీలను ఎస్. రామ్ గోపాల్ ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్. రాంగోపాల్, సీనియర్ న్యాయవాది చిరుమర్రి రఘురామారావు, ఆలయ ప్రధాన కార్యదర్శి కన్నెగుండ్ల రంగయ్య జ్యోతి ప్రజ్వలన చేసి నాటిక పోటీలను ప్రారంభించారు. ఆదివారం శ్రీ భక్త రామదాసు కళామండలి ఖమ్మం వారిచే నాటిక ప్రదర్శన''శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహత్యం'' (పద్య నాటకం)అరవింద ఆర్ట్స్ తాడేపల్లి గుంటూరు జిల్లా వారిచే నాటిక ప్రదర్శన వెండి అంచులు'' సాంఘిక నాటిక పోటీలు నిర్వహించారు. ఈ నాటికలు ప్రేక్షకులకు ఆకట్టుకున్నాయి.