Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
బీఆర్ఎస్ ప్రభుత్వం గహలక్ష్మి పథకం పేరుతో మరో మోసానికి పాల్పడుతుందని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ విమర్శించారు. ఆదివారం పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సొంత స్థలం ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు మూడు లక్షలు ఇస్తామని ప్రకటించడం వెనక ఎన్నికల స్టంట్ ఉందని పేర్కొన్నారు. సొంత స్థలం లేని పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇండ్ల పాత బకాయిలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం మోసమే కదా అని పేర్కొన్నారు. సుమారు 80శాతం బకాయిలు లబ్ధిదారులు కట్టిన తర్వాత మాఫీ అనడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. బకాయిలు చెల్లించిన వారికి తిరిగి ఇస్తారా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పథకాలను హడావుడిగా ప్రవేశపెట్టి అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ప్రభుత్వానికి పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న ప్రయివేటు భూములను కొనుగోలు చేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సింగిల్ విండో మాజీ చైర్మెన్ గార్లపాటి రవీందర్‌రెడ్డి, నాయకులు ఎండీ.యూసుఫ్, అబ్దుల్ మజీద్, చెనగోని రాజశేఖర్‌గౌడ్, నర్సింగ్ మహేష్‌గౌడ్, వంటెపాక సతీష్, వెంకటేష్, నల్గొండ సాయి, నల్గొండ మహేష్, దైద సురేష్ , నవీన్ , మాచర్ల నరేష్, పందిరి సతీష్ పాల్గొన్నారు.