Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్రకుమార్
నవతెలంగాణ-డిండి
విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యతిస్తూ తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని దేవరకొండ శాసనసభ్యులు రామవత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం డిండి మండలంలోని చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న షష్ట్యభ్దిలో భాగంగా ఏర్పాటు చేసిన పూర్వ ఉపాధ్యాయుల, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ గురుకుల పాఠశాలకు, ప్రయివేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారన్నారు. కళావేదికను తూము మాణిక్యమ్మ దశరథరెడ్డి జ్ఞాపకార్థము వారి కుమారులు తూము నాగార్జునరెడ్డి విజయలక్ష్మి, తూము విష్ణువర్ధన్‌రెడ్డి సుమిత్ర దంపతుల సహకారంతో నిర్మించిన కళావేదికను, సరస్వతీ విగ్రహాన్ని, పేర్వాల రజిత జంగారెడ్డి దంపతులు సహకారంతో నిర్మించిన పైలాన్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంలో జెడ్పీటీసీ మాధవరం దేవేందర్‌రావు దాతలు తూము నాగార్జునరెడ్డి, పేరువాళ్ళ జంగారెడ్డి పాఠశాల అభ్యున్నతికి మునుముందు మరింత కషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ శ్రీనివాసరావు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ గోరేటి పుల్లమ్మ, రిటైర్డ్ నల్లగొండ డీఈఓ అడపాల నరసింహారెడ్డి, స్థానిక సర్పంచ్ ఏమిరెడ్డి సుధామణి వెంకటరెడ్డి, మల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, భగవంతరావు, ఏమిరెడ్డి జనార్దన్ రెడ్డి, ,బత్తిని వెంకటరెడ్డి, ముత్యాల శశిధర్ రెడ్డి, అడపాల జంగారెడ్డి, వద్ది జంగారెడ్డి, అబ్దుల్ రజాక్, తదితరులు పాల్గొన్నారు.