Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రెసెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ 2 వ రోజు సమావేశాలు పట్టణంలోని హోటల్ మనోరమలో ఆదివారం ముగిశాయి. సంఘం ప్రధాన కార్యదర్శి రాజు భట్, కోశాధికారి కే.దుర్గప్రసాద్రావు నివేదికలను ప్రవేశ పెట్టారు. వాటిని కౌన్సిల్ సభ్యులు సమీక్షించి అడిగిన సందేహాలనింటికి ప్రధాన కార్యదర్శి, కోశాధికారి సమాధానం ఇవ్వడంతో ప్రధాన కార్యదర్శి, కోశాధికారి నివేదికలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రధానంగా సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలతో పటు మందుల రంగంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ కౌన్సిల్ సమావేశాల్లో చర్చించారు. ఈ సమావేశాలలో ఆస్ట్రాజెనెకా అనే బహుళజాతియా సంస్థ పెద్ద ఎత్తున సేల్స్ ప్రమోషన్ ఉద్యోగులను అన్యాయంగా తొలగించింది. తొలగించిన ఉద్యోగులను తిరిగి వెంటనే ఉద్యోగంలోకి తీసుకోవాలిని తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎఫ్ఎంఆర్ఏఐ సంయుక్త ప్రధాన కార్యదర్శి కే.సునీల్‌కుమార్ కౌన్సిల్ సభ్యులను ఉదేశించి ప్రసంగిస్తూ దిశా నిర్దేశించారు. కౌన్సిల్ సమావేశాలను దిగ్విజయంగా నిర్వహించినందుకు నల్లగొండ శాఖను అభినందిస్తూ ప్రధాన కార్యదర్శి రాజు భట్ తీర్మానం ప్రవేశపెట్టారు. కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించారు. నల్లగొండ జిల్లా ఆర్గనైజర్ సెక్రెటరీ ఆర్.రవికుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు విద్యాసాగర్, సంయుక్త కార్యదర్శి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ సునీల్, దేబా శిష్రామ్, జిల్లా అధ్యక్షులు నిరంజన్, కోశాధికారి పీ.రమేష్, కార్యవర్గ సభ్యులు సుధాకర్, స్వామి, సాయిరాం, నరేష్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.