Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్వైర విహారం చేస్తున్న కుక్కలు
- ఇండ్లలోకి చొరబడుతున్న కోతులు
నవతెలంగాణ-ఆలేరుటౌన్
పురపాలక సంఘంలో కోతుల బెడద కుక్కల బెడద నుండి ప్రజలను అటవీశాఖ ,పురపాలక సంఘ అధికారులు రక్షించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇలలోకి జొరబడి కోతులు పప్పుధాన్యాలు చిరుధాన్యాలు వంట సామాగ్రి ఎత్తుకు వెళ్తున్నాయని వివిధ కాలనీలా వాసులు వాపోతున్నారు. పళ్ళ షాపులపై కూరగాయల షాపుల వద్ద పళ్ళు కూరగాయలు ఎత్తుకెళుతున్నాయని దుకాణ యజమానులు చెబుతున్నారు.ఇండ్లపైకెక్కి స్టార్ టీవీ, సన్ డైరెక్టర్ల డిష్యులను ఊపుతుండడంతో సిగల్ రావడంలేదని టీవీల వీక్షకులు వాపోతున్నారు. ఇళ్లలోకి చొరబడి చిన్నారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దాబాలపై డిష్యులు, కోతులు ఊపడంతో సెట్టింగ్ చేసినప్పుడల్లా వందల రూపాయలు ఖర్చు అవుతున్నాయని లబోదిబోమంటున్నారు. డిష్ రీఛార్జ్ చేయడంతోపాటు నెలలో కోతులు ఊపడం ద్వారా మరింత ఖర్చు పెరిగిందని చెబుతున్నారు. దాబాలపై ఎక్కి అపరిశుభ్రవాతావరణాన్ని సష్టిస్తున్నాయన్నారు.దీంతో ప్రజలకు అనారోగ్యం సైతం గురయ్యే అవకాశం ఉందన్నారు.పట్టణంలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. వేసవి కాలం కావడంతో కుక్కలకు మంచినీరు దొరకపోవడంతో, ఆహారం దొరకకపోవడంతో అవి విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఫంక్షణాలలో పెండ్లిలో ఇతర కార్యక్రమాలు అయినప్పుడు వీధి కుక్కలకు ఆహారం కావాల్సినంత దొరుకుతుంది.ప్రజలు కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఆలేరు పురపాలక సంఘంలోని బహదూర్పేట,సాయిగూడెం పట్టణంలోని అన్ని వార్డులలో ప్రజలు వీధి కుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని పురపాలక కమిషనర్ మారుతి ప్రసాద్ తెలిపారు. తీవ్ర వేసవి కారణంగా రానున్న రోజుల్లో మార్చి ,ఏప్రిల్, మే, జూన్ నెలలలో ఎండల తీవ్రత అధికంగా ఉండే కారణంగా నీటిఎద్దడి తలెత్తడంతో తాగునీరు దొరకక మూగ జీవాలు విచ్చలవిడిగా తిరిగే అవకాశం ఉందన్నారు.
ప్రజలు కోతుల పట్ల వీధి కుక్కల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రజలు, విద్యార్థులు కోతులు కుక్కల పట్ల జాగ్రత్తగా తప్పనిసరిగా తీసుకోవాలి. కోతుల, కుక్కల గుంపుల కు దూరంగా ఉండాలి.కుక్క కోతి వెంబడించినప్పుడు పరిగెత్తకుండా ఒకేచోట నిలబడాలి. పిల్లలు అధికంగా ఉన్న తల్లి కుక్కల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. కుక్క,కోతి తరుముతుంటే వెనితిరిగి చూస్తూ పరిగెత్తరాదు. పడుకున్నా కుక్కల పైన , కోతుల పైన రాళ్లు విసరకుండా ఉండాలి. కోతులు, వీధి కుక్కల సంతాన అభివద్ధి చెందకుండా శాస్త్ర చికిత్స ఏర్పాటుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి.కుక్కల పట్ల కోతుల పట్ల అజాగ్రత్త అసలు పనికిరాదు.
కోతుల, కుక్కల పట్ల అజాగ్రత్త గ ఉండకూడదు
పురపాలక కమిషనర్-మారుతీ ప్రసాద్
ప్రజలు, విద్యార్థులు కోతుల కుక్కల పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు.వేసవికాలం దష్ట్యా కుక్కలు తగినంత ఆహారం నీరు దొరకక స్వైర విహారం చేసే ప్రమాదం పొంచి ఉంది. కుక్కల వద్ధిరేటును తగ్గించేందుకు శాస్త్ర చికిత్స కొరకు ఉన్నతాధికారులతో మాట్లాడుతున్నాం.త్వరలోనే కోతుల కుక్కల విడుదల అరికడతాం.ప్రజా సమస్యల పరిష్కారం కోసం పురపాలక అధికారులుగా పనిచేసే బాధ్యత మాపై ఉంది.
కోతుల నిర్మూలనకు తగిన చర్యలు తీసుకుంటాం
ఫారెస్ట్ అధికారి-వెంకటేశ్
కోతుల నిర్మూలన కోసం ప్రభుత్వం ఇప్పటికే మొక్కలు నాటి వనాలను తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందించిం ది.అందులో భాగంగా హరితహారంలో మొక్కలు నాటడం నర్సరీలు పెంచడం ముమ్మారంగా జరుగుతున్నాయి .కోతులపట్ల ప్రజలు అజాగ్రత్తగా ఉండకుండా వాటికి దూరంగా అప్రమ త్తంగా ఉండాలి.తప్పనిసరిగా కోతుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం.