Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ-ఆలేరుటౌన్
నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలలో మిగిలిపోయిన రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి అన్నారు.వివిధ మండలాల నుండి ప్రజల నుండి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రతి శనివారం నిర్వహించే ప్రజా దర్బార్‌లో వినతులు అందుతున్నాయన్నారు.నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టే అభివద్ధి పనులకోసం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును మరిన్ని నిధులు మంజూరు కోరుతూ కలిసి విన్నవించినట్టు తెలిపారు.యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లి గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి( ఆలేరు నియోజకవర్గం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి )నియోజకవర్గంలో అన్ని మండలాల్లో రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.ప్రతి మండలంలో ప్రజాదర్బారు నిర్వహించాలని ఎమ్మెల్యేను కోరారు.9 వ వార్డు కౌన్సిలర్ మోర్తాల సునీత రమణారెడ్డి వార్డు అభివద్ధికి నిధులు కేటాయించి అభివద్ధి సహకరించినందుకుగాను కతజ్ఞతలు తెలిపారు.వార్డు అభివద్ధికి మరింత సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్టమల్లేశం, చింతకింది మురళి, మొరిగాడి వెంకటేష్, ఆడెపు బాలస్వామి, కుడేసంపత్, వడ్ల శోభన్‌బాబు, దయ్యాలసంపత్, ముదిగొండ శ్రీకాంత్, కోటగిరి ఆంజనేయులు, చిమి శివమాలు, బెదరకోటదుర్గేష్, ఏమే కల్యాణ్, బీఆర్ఎస్నాయకులు పాల్గొన్నారు.