Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని,మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించా లని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు.ఆదివారం మహేంద్ర యువసేన,మహిళా సంఘ బంధం బండకొత్తపల్లి ఆధ్వర్యంలో వీఓఏ గద్వాల సువర్ణ అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గర్భిణులకు న్యూట్రిషన్ కిట్ మొదలు వద్ధ మహిళల వరకు అనేక సంక్షేమపథకాలు ప్రవేశపెట్టిందన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రారంభించుకున్నా మన్నారు.ఈ కార్యక్రమం ద్వారా మన ప్రభుత్వాస్పత్రిలో అన్ని రకాల పరీక్షలు చేసి మందులు ఇస్తారని ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.అనంతరం గ్రామ మహిళా సంఘం సభ్యులు ఆమెను శాలువాతో సన్మానించారు. మహిళా దినోత్సవ వేడుకల్లో ఏఈఓ ఆకాంక్ష ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తాండ్ర అమరావతి శోభన్,కోలుకొండ లక్ష్మీరాములు,వైస్‌ఎంపీపీ మహేశ్వరం మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మెన్ మూగల శ్రీనివాస్,సర్పంచులు గోపాల్ దాసు భిక్షమమ్మ వెంకన్న,పందుల రేేఖ,తోటకూరి రాధిక,ఎస్ఎంసీ చైర్మెన్ గోపాల్‌దాసు రేణుక, సంఘ బంధం సభ్యులు సోమలక్ష్మీ, అండాలు,నీలమ్మ,హారిక తదితరులు పాల్గొన్నారు.