Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
మున్సిపాలిటీ పరిధిలో తారకరామ్ నగర్ 32 వార్డులో, 5 వార్డు, 21వ వార్డుల్లో ఏర్పాటు చేసిన బస్తీ దావఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం వాటిని ప్రారంభించి ఆయన మాట్లాడారు. జిల్లాలో మొదటిసారిగా పట్టణంలో బస్తీ దావఖానాలను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు, మంత్రి హరీష్ రావుకు కతజ్ఞతలు తెలిపారు. బస్తీదావఖానాలో ఉచితంగా 108 రకాల మందులు, రోగనిర్ధారణ పరీక్షలు, ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ అవకాశాన్ని కాలనీవాసులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఏరియా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలోజిల్లా వైద్య అధికారి మల్లికార్జున్ రావు, గ్రంథాలయ సంస్థల చైర్మెన్ జడల అమరేందర్ గౌడ్ ,మున్సిపల్ చైర్మెన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మెన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్ ఏవి కిరణ్ కుమార్, కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.