Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వివిధ సమస్యలపై 26 ఫిర్యాదులను స్వీకరించారు. రెవిన్యూ శాఖ 16, మత్స్యశాఖ 2, మున్సిపాలిటీ 2, పంచాయితీ శాఖ, మైనారిటీ శాఖ, సహకారశాఖ, భువనగిరి ప్రభుత్వ ఏరియాసుపత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖలు ఒక్కొక్కటి చొప్పున ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ డి.శ్రీనివాసరెడ్డి, కలెక్టరేట్ పరిపాలన అధికారి ఎం.నాగేశ్వరా చారి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.