Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడున్నర తులాల పుస్తెలతాడు, హోండా యాక్టివా,రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
- డీసీపీ రాజేశ్చంద్ర
నవతెలంగాణ- భువనగిరిరూరల్
చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసినట్టు డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. సోమవారం స్థానిక డీసీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లకు వివరాలు వెల్లడించారు. రామన్నపేటకు చెందిన బైరబోయిన వినరు మోత్కూర్‌లోని ఒక బ్యాంకులో ప్రయివేటు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 11 తన డ్యూటీ ముగించుకొనిహోండా యాక్టివా స్కూటీపై ఇంటికి వస్తూ మార్గమధ్యంలో వలిగొండ మండలం వేములకొండ గ్రామ శివారులో లక్ష్మాపురం రోడ్డు వైపు ఒంటరిగా మహిళ వెళ్తుండగా చూశాడు. ఆమె మెడలో బంగారు పుస్తెలతాడును చూశాడు. ఆమె పొలం వద్దకు వెళ్లగా అక్కడికి వెళ్లి ఆమె మెడలో ఉన్న రెండు వరుసలో బంగారు పుస్తెల తాడును లాక్కొని స్కూటీపై పారిపోయాడు. వినరు ఈ నెల12న ఆదివారం అతని స్నేహితుడు రెకరేషన్ వర్కర్‌గా పనిచేస్తున్న మేకల సంపత్‌కు ఫోన్ చేసి దొంగతనం చేసిన బంగారు గొలుసును భువనగిరిలో అమ్ముదామని పిలిచాడు. ఇద్దరు కలిసి స్కూటీ పై భువనగిరికి వెళ్తుండగా వలిగొండ మండలం నాగారం ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వారిని పట్టుకుని విచారించారు. దొంగతనం చేసినట్టుగా ఒప్పుకున్నాడు. వారి వద్ద బంగారు పుస్తెలతాడు, యాక్టివా బైక్, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని సోమవారం రిమాండ్‌కు తరలించారు. రాచకొండ కమిషనరేట్ సీపీడీిఎస్ చౌహాన్ నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జోన్ పోలీసుల ఆరు బృందాలుగా ఏర్పాటు చేసి నిరసన కోసం గాలింపు చర్యలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా అనేక కూడల మెగా పెట్టి నిరసన అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన వలిగొండ ఎస్సై ప్రభాకర్, చౌటుప్పల్ సిఐ మల్లికార్జునలను రాచకొండ కమిషనరేట్ సీపీ, డీసీపీలు అభినందించారు.