Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -బీబీనగర్
కరీంనగర్ జిల్లా బీబీపేట మండలం గ్రామపంచాయతీ ఉద్యోగి కొంగరి రాజు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనకు నిరసనగా సోమవారం బీబీనగర్ గ్రామపంచాయతీ కార్మికులు పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పొట్ట యాదమ్మ మాట్లాడుతూ చనిపోయిన ఉద్యోగి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పాశం బాలయ్య, నాయకులు యాదగిరి, స్వామి, సుధాకర్, రవి, ప్రభాకర్, అరుణ్, ఉపేందర్, మైసమ్మ, శోభ, లింగమ్మ, బాలరాజు, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.