Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
జిల్లాలో ఇసుక మాఫియాను అరికట్టాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్చేశారు. తెలంగాణ రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పైళ్ల యాది రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుకను అరికట్టాలన్నారు. గ్రామాలలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు ఏశాల అశోక్, చెక్క వెంకటేష్, ఆరుట్ల సుశీల,రైతు సంఘం జిల్లా నాయకులుఉప్పుల కొమరయ్య, జక్క దయాకర్ రెడ్డి,తెడ్డు ఆంజనేయులు,దొండ ఎల్లయ్య, చెడే రవీందర్,సంగం గణేష్,పుట్ట రమేష్, చంద్రకళ పాల్గొన్నారు.