Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరురూరల్
మండలంలోని పలు శాఖల సంబంధిత అధికారులు సమయపాలన పాటించకపోవడంతో గంటసేపే సర్వసభ సమావేశం నిర్వహించామని ఎంపీపీ గంధమల్ల అశోక్ మండిపడ్డారు. సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమానికి వారు హాజరై ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్వసభ సమావేశానికి మూడు నాలుగు శాఖల వారే హాజరయ్యారని పేర్కొన్నారు. మిగతావారు రాకపోవడంతో రాకపోవడంతో గ్రామాలలో ఉండే సమస్యలు తెలియడం లేదన్నారు .అనంతరం గ్రామ సర్పంచులు మాట్లాడుతూ గ్రామాలలో సంక్షేమ పథకాల పనులు చేపట్టినప్పటికీ వాటి బిల్లులు రాకపోవడం బాధాకరమన్నారు. గ్రామాలలో నీటి సమస్య అధికంగా ఉందన్నారు .వ్యవసాయ అధికారులు గ్రామాల వైపు రావడానికి మొహం చాటేసుకుంటున్నారన్నారు .ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జ్ఞాన ప్రకాష్ రావు, వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ ,సూపర్డెంట్ వెంకటరమణ, సారాజిపేట వైద్యాధికారి నవీన్ కుమార్ ,ఏపిఎం మీనా ,గ్రామ సర్పంచులు శ్రీశైలం, లక్ష్మి ,ఎంపీటీసీలు సొంటెం కవిత, బత్తుల నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.