Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పారిశుధ్య పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి
- అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
అర్జీదారుల దరఖాస్తులపై వెంటనే స్పందించాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ ఎస్. మోహన్ రావు తో కలసి పాల్గొని అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ధరణి ఫోల్డర్ ద్వారా సరైన రీతిలో అర్జీదారులు చేసుకున్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించ బడతాయని అన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాలలో పారిశుధ్య పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ,వేసవి దృష్ట్యా నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.ప్రజావాణిలో భూ సమస్యల దరఖాస్తులు 58, వైద్య శాఖ 8, హౌసింగ్ 8, విద్యుత్ శాఖ 5, డీఆర్డీఏ 13, ఇతర శాఖల దరఖాస్తులు 2 అందాయని అట్టి దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో సీపీఓ వెంకటేశ్వర్లు, జిల్లా సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ, అనసూర్య,శిరీష, శంకర్, డీఈఓ అశోక్, డీఏఓ రామారావు నాయక్, డీహెచ్ఓ శ్రీధర్ గౌడ్, ఏ. ఓ శ్రీదేవి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.