Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండగా నిలిచిన మంత్రి గుంటకండ్ల జగదీశ్
నవతెలంగాణ -సూర్యపేట రూరల్
ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బీఆర్ఎస్ నేత కుటుంబానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అండగా నిలిచారు. కుటుంభ పెద్ద ను కోల్పోయి, అనాధ లా మారిన కుటుంభానికి, నేను ఉన్నా అంటూ మనోధైర్యాన్ని ఆ కుటుంబానికి అందించాడు. నేడు సూర్యాపేట లోని జానయ్య నగర్ కాలనీ లో కుటుంభ సభ్యుల కోసం ఇంటి నిర్మాణానికి గాను మంత్రి జగదీష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సూర్యాపేట మండలంలోని యర్కారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వంటెద్దు వెంకన్న రాజకీయ వివాదాల నేపథ్యంలో హత్య కు గురయ్యారు.ఈ నేపద్యం లో వెంకన్న కుటుంబానికి అండగా ఉంటానని, హామీ ఇచ్చిన మంత్రి వెంకన్న కూతుర్ల ను చదివిస్తున్నారు.వారికి స్థిర నివాసం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో, నేడు గాందీ నగర్ పరిదిలోని జానయ్య నగర్ కాలనీ లో ఇంటి ని నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు.ఇంటి నిర్మాణం కు అయ్యే ఖర్చులు మొత్తం తానే భరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ ,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, ఎల్కారం సర్పంచ్ చింతలపాటి మౌనిక మధు, బీఆర్ఎస్ నేతలు, కార్యక్రర్తలు తదితరులు పాల్గొన్నారు.