Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను
నవతెలంగాణ-హుజూర్నగర్టౌన్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు శీలం శ్రీను డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ముందు నిర్వహించిన పంచాయతీ కార్మికుల ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. కార్మికులకు ప్రతినెలా క్రమం తప్పకుండా వేతనాలు అందజేయాలన్నారు. గత కొద్ది నెలలుగా వేతనాలు అందక జీవన ప్రమాణం దెబ్బతిని బీబీ పేటలో ఆత్మహత్య చేసుకున్న కార్మికుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అందజేయాలని, అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలన్నారు. పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సురభి వెంకటేశ్వర్లు, ఉప్పల వీరారెడ్డి, శ్రీను, చంటి, రత్నం, కొండలు, ఎల్లమ్మ, సైదమ్మ, హుస్సేన్, గౌస్, నాగరాజు, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.