Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి
నవతెలంగాణ- చివ్వేంల
మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా ప్రకటించిన గిరిజన బంధు పథకం ఎప్పుడు యిస్తారోతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి డిమాండ్ చేశారు.సూర్యాపేట నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం హాత్ సే హాత్ జోడో అభియాన్ స్ఫూర్తితో చేపట్టిన మహా పాదయాత్ర 25 వ రోజు చివ్వేంల మండల కేంద్రం నుంచి సూర్య నాయక్ తండాకు ప్రవేశించింది... పాదయాత్రలో భాగంగా ఆయన గడపగడపకు తిరుగుతూ ప్ర్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ వాతావరణంలో పేద ప్రజల కష్ట నష్టాలు చూస్తూ పెరిగిన వాడిని ప్రతి పేదవాడి కష్టసుఖాలలో పాలుపంచుకుంటానని తెలిపారు.
గిరిజనుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెరిగిన గిరిజన జనాభా లెక్కల ప్రకారం, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాల్సిన ప్రభుత్వం తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నామా ప్రవీణ్, గోపాల్ రెడ్డి, యాట ఉపేందర్, మండల నాయకులు రవినాయక్,భాస్కర్ నాయక్,నర్సిరెడ్డి,కొండా వెంకన్న,శివ నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.