Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేట
చదువు కొద్దిమందికి పరిమితమైన రోజుల్లో ఎంతో వివక్షతను ఎదుర్కొని సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా ఐదు రోజుల్లో తెలుగులోకి అనువదించిన తొలి మహిళ కవయిత్రి కుమ్మర మొల్ల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనిబీఆర్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై వెంకటేశ్వర్లు అన్నారు. కుమ్మర శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి మహిళ కవయిత్రి మొల్ల జయంతి సందర్భంగా సోమవారం స్థానిక కుమ్మర శాలివాహన భవనంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన మాట్లాడారు. ఐదు రోజుల్లో రామాయణాన్ని తెలుగులో అనువదించి శ్రీకృష్ణదేవరాయల మెప్పు పొందిన మొల్ల శాలివాహన కులానికి చెందిన మహిళా కావడం గర్వనీయమన్నారు.తొలి మహిళ కవయిత్రి మొల్ల స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు జిల్లా కేంద్రంలో మొల్ల విగ్రహ ఏర్పాటుకు పార్టీలకతీతంగా కలిసి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ నరేష్, కౌన్సిలర్ రాపర్తి శ్రీనివాస్, శాలివాహన సంఘం జిల్లా అధ్యక్షులు ఖమ్మంపాటి రేణు బాబు, పట్టణ అధ్యక్షులు సలిగంటి నాగయ్య, నాయకులు సిరివెళ్ల శబరి నాథ్, సలిగంటి వీరేందర్, సలిగంటి శ్రీనివాస్, మద్దికుంట్ల చింటూ, ప్రభాకర్, నిమ్మనగొటి వెంకన్న, రాంబాబు, మధు, మోహన్, సిరికొండ నాగయ్య, లింగాల గుంశావళి తదితరులు పాల్గొన్నారు.
కోదాడరూరల్:పట్టణంలోని రంగా థియేటర్ చౌరస్తాలో మొల్లమాంబ జయంతి కార్యక్రమాన్ని కుమ్మరి కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించి పలువురు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొల్లమాంబ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాల న్నారు. అనంతరం మొల్లమాంబ జీవిత చరిత్ర గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మామిడి రామారావు, చలిగంటి రామారావు, పోరళ్ల సత్యనారాయణ, చలిగంటి లక్ష్మణ్, సిలివేరు నరసింహారావు, గడియారం శ్రీను, చలిగంటి ప్రసాద్, సలిగంటి మురళి, అఖిల్, పీ.సూర్యనారాయణ, మొగిలిచర్ల నాగరాజు, పీ.సతీష్, దామెర రవి, సీిహెచ్.రమేష్, సీహెచ్ .రంగా, పీ.శివ, దాము తదితరులు పాల్గొన్నారు.