Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి
నవతెలంగాణ-నార్కట్‌పల్లి
ప్రతి పరిశోధన సమాజ హితాన్ని కాంక్షించేది ఒక విలువను జోడించేదిగా ఉండాలని ఎంజీ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఐసీఎస్ఆర్ సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక శాస్త్రాల పరిశోధన విద్యార్థులకు మూడు పరిశోధన పద్ధతులపై మూడు రోజుల శిక్షణ సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. నేడు మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, కంప్యూటర్ ఇంటర్నెట్ తదితర మాధ్యమాల ద్వారా సమాచార సేకరణ అత్యంత సులభంగా మారిన దరిమిలా నాణ్యమైన పరిశోధనలకు చక్కని అవకాశం అన్నారు. పరిశోధనల పట్ల మరింత జిజ్ఞాసతో క్రొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి అని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ ఆకుల రవి, కన్వీనర్ డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, కో కన్వీనర్ల కార్యక్రమ రూపకల్పనకు అమలుకు, అత్యుత్తమమైన వక్తలను ఎంపిక చేసి నందుకుగాను ప్రశంసించారు. ఎంజీయూ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ బోయినపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ యువ శాస్త్రవేత్తలు ఈ దేశానికి అవసరమన్నారు. అనంతరం పరిశోధకులకు ధ్రువ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ డాక్టర్ ఆకుల రవి, కో కన్వీనర్ డాక్టర్ కొప్పుల అంజిరెడ్డి, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.