Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యుడు వస్కుల మట్టయ్య
నవతెలంగాణ-మిర్యాలగూడ
ఈనెల 15న మిర్యాలగూడలో నిర్వహించే భీమిరెడ్డి నరసింహారెడ్డి శతజయంతి ముగింపు సభను జయప్రదం చేయాలని ఎంసీపీఐ(యూ) కేంద్ర కమిటీ సభ్యులు వస్కుల మట్టయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఆ పార్టీ జిల్లా కమిటీ సమావేశం మాతంగి విశాలాంధ్ర అధ్యక్షతన మండలంలోని యాధ్గర్పల్లిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు మాజీ శాసనసభ, పార్లమెంటు సభ్యులు ఎంసీపీఐయూ పోలిట్ బ్యూరో సభ్యులు భీమిరెడ్డి నరసింహారెడ్డి చేసిన సేవలను కొనియాడారు. మార్చి 15న మిర్యాలగూడ పట్టణంలో భీమిరెడ్డి శత జయంతి ముగింపు సభకు ఎంసీపీిఐ(యూ) జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దికాయల అశోక్ ఓంకార్, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదగోని రవితో పాటు రాష్ట్ర నాయకత్వం వామపక్ష పార్టీల నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, జిల్లా కార్యదర్శి వస్కుల సైదమ్మ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపి, జ్యోతి, మోహన్‌నాయక్, కాశి, చంద్రకళ, వెంకన్న, వీరయ్య, ఆశీర్వాదం, గురవయ్య, లింగమ్మ పాల్గొన్నారు.