Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
జర్నలిస్టులకు త్వరలో ఇండ్ల పట్టాలు పంపిణీ చేస్తానని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు,ఆర్డీఓ చెన్నయ్య హామీ ఇచ్చారు. మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, పలు జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆర్డీవో కార్యాలయంలో ఎమ్మెల్యే భాస్కరరావు ఆర్డీవో చెన్నయ్యలకు వినతిపత్రాలు అందజేశారు.మిర్యాలగూడ పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రభుత్వ భూములను గుర్తించి తక్షణమే పంపిణీకి చర్యలు తీసుకోవాలని జిల్లా సర్వేయర్ బాలాజీనాయక్ను వారు ఆదేశించారు.అర్హులైన జర్నలిస్టుల జాబితాను ఇవ్వాలని సూచించారు. త్వరలోనే అందరికీ ఇండ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు జర్నలిస్టుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు.వినతిపత్రాలు అందజేసిన వారిలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు ఖాజా హమీదుద్దీన్,జిల్లా అధ్యక్షులు ఆయూబ్, రాష్ట్ర నాయకులు జి.వెంకన్న, మహేష్,ఖాజానజిమోద్దీన్, కిషోర్, యాదగిరి, నాగరాజు అరుణ్, రమేష్,నాగాచారి, మందసైదులు, జయరాజు, రామకృష్ణ, అస్లాం, నాగయ్య,, నాసరోద్దీన్, బాస్కర్, వేణు, బాలాజీ, రామకృష్జ, రంగ శ్రీను, మట్టయ్య, వెంకట్, శ్రీను నాయక్, ప్రసాద్, శ్రీను, వసీం, హరీష్, బాబు, శ్యామ్, సైదులు, నర్సింహ ఉన్నారు.స్థలు విద్యార్థులకు హల్ టికెట్లు ఇచ్చే సమయంలో ఫీజుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే విద్యాసంస్థల ముందు పెద్దఎత్తున ధర్నాలకు దిగతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు. యంఏ.హంజఖాద్రీ, ఎద్దు ప్రవీణ్, కొండలు, రాము, నాగార్జున, మధు, తదితరులు పాల్గొన్నారు.