Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించొచ్చని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు.ఎస్ఎఫ్ఐ జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అరోరా జూనియర్ కళాశాలలో మంగళవారం ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు భవిష్యత్‌లో జరగబోయే కామన్ ఎగ్జామ్‌లకు విద్యార్థులలో భయాన్ని పోగొట్టడం కోసం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అధ్యయనపోరాట నినాదంతో విద్యార్థులలో మనోధైర్యాన్ని నింపడం కోసం ఇలాంటి ప్రతిభ పరీక్షలు నిర్వహించారని తెలిపారు.దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా విద్యార్థులంతా కలిసి నూతన జాతీయ విద్యావిధానం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తూ ప్రయివేట్ యూనివర్సిటీలో బిల్లును తీసుకొచ్చి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువులను దూరం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. భవిష్యత్‌లో పేద మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మూడావత్ రవినాయక్, మంగారెడ్డిగౌతమ్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటిశంకర్,గిరిజన సంఘ జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్‌నాయక్,మిర్యాలగూడ డివిజన్ కార్యదర్శి కొర్రా సైదానాయక్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు వదూద్, జగన్నాయక్, తరుణ్, సమ్మ, పిలుట్ల సైదులు పాల్గొన్నారు.