Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి
నవతెలంగాణ- వేములపల్లి
కేంద్రంలో మోడీ మరో ఔరంగజేబు లా మారారని ,వివిధ రకాల పన్నులు వేసి ప్రజలను వేధిస్తున్నారని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరువుపల్లి సీతారాములు ,మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మించిన సీపీఐ(ఎం) నూతన కార్యాలయ భవనాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో చెరుపల్లి, నంద్యాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజల సంపదను ఆదాని, అంబానీలకు దోచి పెడుతు న్నారన్నారు. వివిధ రకాల అత్యవసర వస్తువులపై పన్నులు పెంచడంతో సామాన్యులు జీవించడం కష్టంగా మారిందన్నారు. ప్రజల కష్టం తెలిసిన ప్రభుత్వం అధికారంలో ఉండాలన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించే బీజేపీ ప్రభుత్వాన్ని అణగదొక్కే బాధ్యత అందరిపై ఉందన్నారు. సామ్యవాదం గురించి మాట్లాడకపోతే భవిష్యత్తు లేదన్నారు. దేశం ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళుతుందని మేధావులు తెలియజేస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని శ్రేణులు ఏకం కావాలని ఎర్రజెండా వైభవాన్ని నిలబెట్టుకోవాలన్నారు. తోపుచర్లలో ఎన్నో పోరాటాలు చేసిందని ,మద్దతు ధర, లిఫ్టులు, వరద కాలువ, మంచినీరు ,మౌలిక వసతులపై ఉద్యమించిందన్నారు.సీపీఐ(ఎం) కార్యాలయాలు ఉద్యమాలకు కేంద్రాలుగా, సమస్య పరిష్కారాలకు నిలయంగా నిలువాలన్నారు.
హోల్ సెల్‌గా దేశాన్ని అమ్మేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది: జూలకంటి
దేశాన్ని హోల్ సేల్‌గా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. సీపీఐ(ఎం) పార్టీ కార్యాలయం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చి తొమ్మిదేండ్లు పూర్తవుతున్న ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం నల్లధనం తెప్పిస్తానని ప్రజల ఖాతాల్లో 15 లక్షల రూపాయలు జమ చేస్తానని హామీ ఇచ్చిందన్నారు. కానీ నల్లధనం ఉన్న వారంతా కేంద్ర ప్రభుత్వం చుట్టూ భజన చేస్తూ స్నేహితులుగా మారారన్నారు .రైతులకు అనుకూలమైన చట్టాలు తెస్తామని మూడు నల్ల చట్టాలు తెచ్చారని వాపోయారు. 13 నెలలు లక్షల మంది పోరాటాలు చేయగా 750 మంది రైతుల ప్రాణాలు పోగా నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారు. అంతే కాకుండా కార్మిక వ్యతిరేక చట్టాలను తెచ్చారని 12 గంటలు పని చేయాలని, సమ్మె చేయవద్దని, సంఘాలు పెట్టవద్దు కార్పొరేట్ కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తెచ్చారన్నారు. ధరలు పెరిగి సామాన్య జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 65 లక్షల కోట్ల అప్పు ఉండగా కోటి 35 లక్షల కోట్ల అప్పు పెరిగిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను అమ్మేశారన్నారు. 135 కోట్ల ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే దేశ సంపదను అమ్మేస్తూ ధరలు పెంచి, నిరుద్యోగాన్ని మిగిల్చారన్నారు .ప్రజల మధ్య ఐక్యతను పెంచకుండా చీలికలు తెచ్చి విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. బీజేపీికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలపై, ప్రభుత్వాలపై, పాత్రికేయులపై దాడి చేస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారన్నారు. అలాంటి ప్రభుత్వాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.బీజేపీిని ఎదుర్కోవడానికి రాష్ట్రంలో కొన్ని సందర్భాల్లో కొన్ని పార్టీలతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నామన్నారు. కేంద్రంపై చేస్తున్నయుద్ధం నెగ్గాలంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎంకు తెలియజేశామన్నారు. రాబోయే కాలం ఉద్యమాల, ఎన్నికల , పోరాటాల కాలమన్నారు. ప్రతి కార్యకర్తా సైనికుల ముందుండి పనిచేయాలన్నారు. మాడుగుల పల్లి కేంద్రంగా మూడు నియోజకవర్గాల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గ్రామ గ్రామాన తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డబ్బికార్ మల్లేష్, పాలడుగు నాగార్జున, సయ్యద్ హాషం, గౌతంరెడ్డి, తుమ్మల పద్మ, నారాయణరెడ్డి, శ్రీనివాస్, శ్రీకర్ ,గోవర్ధన తదితరులు పాల్గొన్నారు.