Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భూదాన్‌పోచంపల్లి
మండలంలోని జూలూరు పీఏసీఎస్‌లో జరిగిన అవినీతిపై అధికారుల నిర్లక్ష్యం వీడి, అవినీతికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రికవరీ చేసిన డబ్బులను రైతు ఖాతాలో జమ చేయాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోట రామచంద్ర రెడ్డి డిమాండ్‌చేశారు. మంగళవారం జూలూరు గ్రామ పీఏసీఎస్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగల్ విండోలో అవినీతి జరిగిందని 2022లో అధికారులు చాలా వివరంగా ఆడిట్ రిపోర్టులో పొందుపరిచారన్నారు. కానీ ఇప్పటివరకు దాని విషయంలో అధికారులు ఎలాంటి స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు.అవినీతికి పాల్పడిన డబ్బును వెంటనే రికవరీ చేయాలని అధికారులు తగిన విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై పది రోజులలో చట్టరీత్యా చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి ,సింగల్ విండో మాజీ డైరక్టర్ బాణాల ఎల్లారెడ్డి, డైరెక్టర్లు అందెల జ్యోతి బొబ్బల బాలకృష్ణారెడ్డి గట్టు రామ్ రెడ్డి, ఉడుతల జంగయ్య ,యాదిరెడ్డి, నాయకులు పగిళ్ల లింగారెడ్డి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మంచాల మధు, నాయకులు గూడూరు బుచ్చిరెడ,ి్డ నెల కంటి జంగయ్య, కల్కూరి బిక్షపతి, వారాల మల్లారెడ్డి, వీరారెడ్డి ,పగిళ్ల లావణ్య, పత్తి బిక్షపతి, దాసరి రాజు ,నవీన్ బుగ్గ ,లక్ష్మయ్య ,జంగారెడ్డి, శ్రీనివాస్ ,రెడ్డి,కందడి రాంరెడ్డి కాసుల పన్నీరు అంజయ్య నాగరాజు రైతులు తదితరులు పాల్గొన్నారు.