Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
ఆవిర్భవించిన 42 సంవత్సరాల నుండి న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం న్యాయవాదుల రక్షణ కోసం అనేక ఉద్యమాలను ఆలిండియా లాయర్స్ యూనియన్ నిర్వహించి విజయాలు సాధించిందని ఆ యూనియన్ జిల్లా అధ్యక్షులు మామిడి వెంకట్ రెడ్డి అన్నారు. ఐలూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం స్థానిక కోర్టు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదులు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1982 మార్చి 13 న ఆవిర్భవించి 42ఏండ్లు గడుస్తున్నాయని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కొత్తగా న్యాయవాద వృత్తి లోకి వచ్చిన న్యాయవాదులకు పదివేలు స్టైఫండ్ ఇవ్వాలని, న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, వివిధ కోర్టు ల లో ఖాళీగా ఉన్న పోస్ట్ లను భర్తీ చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఐలూను స్థాపించిన వ్యవస్తపాకులు జెస్టిస్ విఆర్ కృష్ణయ్యర్, హెచ్ ఆర్ ఖన్నా, ఎసి గుప్తా, పిఎస్ పాతి పోస్టర్ ను రామన్నపేట బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల హనుమంతు గౌడ్, సీనియర్ న్యాయవాది అక్కనపల్లి వాసుదేవరావు, దుశర్ల నరేందర్ రావు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పాల్వంచ జగతయ్య, యాదాసు యాదయ్య, రవీందర్, సత్యనారాయణ, రమేష్ పాల్గొన్నారు.