Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
నీటమునిగి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి పోతురాజు జహంగీర్ ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని వాసాల మర్రి గ్రామంలో ఆ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో చెరువు కింద నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాసాలమర్రి గ్రామంలో జీవనోపాధి కోసం18 మంది రైతులు 20 ఎకరాల పొలం 420, 421, 424, 427, 428,429, 430, 450, 451,452. ఈ సర్వే నెంబర్లలో రైతులకు ముందస్తు సమాచారం లేకపోవడం వల్ల వరి చేను సాగు చేసుకున్నారన్నారు. కొండపోచమ్మ కాలువ ద్వారా చెరువులోనికి నీటిని విడుదల చేయడం వల్ల ఇప్పటికీ 10 ఎకరాలు నీట మునిగిందన్నారు.మరో రెండు రోజుల్లో పూర్తిగా ఇరవై ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి అధికారులను పంపి సర్వే చేయించి ఎకరానికి రూ.60 వేల చొప్పున నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల నాయకులు కొక్కొండ లింగయ్య, తూటి వెంకటేశం, లక్ష్మి, రైతులు పలుగుల భాస్కర్, పలుగుల దుర్వాసులు, హాజీపురం రాములు, హాజీపురం కిష్టయ్య ,చినరాజు సత్తయ్య, చిన్ రాజు, చంద్రయ్య, లక్కాకుల లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.