Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
ఈ నెల 15 నుండి 29 వరకు నిర్వహించే ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెంటర్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఓ పృద్విరాజ్ చీఫ్ సూపర్డెంట్ కే కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9 గంటల లోపే విద్యార్థులు పరీక్షకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు.పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుందని తెలిపారు.విద్యార్థులు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు తెలుగు సంస్కృతం పరీక్ష జరుగుతుందన్నారు.కళాశాలలో పరీక్షలు నిర్వాహనకు అన్ని ఏర్పాటు చేశామన్నారు విద్యార్థులు అవసరాలకు అనుగుణంగా తాగునీరు,లైట్లు,టాయిలెట్స్ తగిన సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక వైద్య సిబ్బందిని కూడా నియమించామని తెలిపారు.