Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 17న జరిగే జిల్లా సదస్సును జయప్రదం చేయండి
- రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి
నవతెలంగాణ -రామన్నపేట
కేంద్ర ప్రభుత్వం అవలంభించే రైతు, కార్మిక, కూలీ వ్యతిరేక విధానాలను ఐక్యంగా ఉద్యమించి తిప్పి కొట్టాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మేక అశోక్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ సంఘాల మండల జనరల్ బాడీ సమావేశం బుధవారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 17న భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించే జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. రైతు చట్టాలతో వ్యవసాయాన్ని కార్పోరేట్లకు తాకట్టుపెట్టి నూతనంగా విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకువస్తూ రైతుల భవితవ్యాన్ని ప్రశ్నార్థకంగా మారుస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నూతన లేబర్ చట్టాలతో హక్కుల కోసం కార్మికులు పోరాడకుండా చేసి శ్రమను దోచుకుంటుందన్నారు. ఉపాధిహామీ చట్టానికి నిధులు కేటాయించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారన్నారు. బీజేపీ అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఏప్రిల్ 5 న చలో ఢిల్లీ చేపట్టి లక్షలాదిమందితో మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బొడ్డుపల్లి వెంకటేశం, రైతు సంఘం మండల అధ్యక్షుడు గన్నెబోయిన విజయభాస్కర్, వైస్ ఎంపిపి నాగటి ఉపేందర్, బల్గూరి అంజయ్య, కందుల హనుమంతు, దోమలపల్లి నర్సింహ్మ, కూనూరు గణేష్ తదితరులు పాల్గొన్నారు.