Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భువనగిరి
జిల్లాలోబీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి కోరారు. బుధవారం భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అధ్యక్షతన పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీిఆర్ఎస్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు ,వివిధ మండల , పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు ,పట్టణాల్లో పార్టీని మరింత పటిష్టపరిచి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలందరికీ వివరించి మరింత చేరువ కావాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి కార్యకర్త ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మున్సిపల్ చైర్మెన్లు, వైస్ చైర్మెన్లు ,ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మెన్లు, పీఏసీఎస్ చైర్మెన్లు ,బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.