Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- ఆలేరుటౌన్
మండల కేంద్రంలో రహదారి బంగ్లా వద్ద ఏర్పాటుచేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు.ప్రజలకు మెరుగైన కంటి వైద్య సదుపాయాలు అందజేయాలని కోరారు. మొత్తం 106 మంది వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ నరేష్, కంటి వైద్యులు ఝాన్సీ, మానస , వర్షిని, సూపర్వైజర్ యాకయ్య, మున్సిపల్ సిబ్బంది ఆలేటిలింగం, పాములపర్తి రామచంద్రారెడ్డి, ఆడెపు బాలస్వామి, వడ్ల శోభన్ బాబు, కోటగిరి పాండారి , తదితరులు పాల్గొన్నారు.