Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తీవ్రంగా నష్టపోతున్న పత్తి రైతులు
నవతెలంగాణ-గుండాల
క్వింటాల్ పత్తికి పదివేల రూపాయల మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని సీపీఐ (ఎం) మండల కార్యదర్శి మద్దెపురం రాజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని సీతారాంపురం గ్రామంలో మండల కమిటీ ఆధ్వర్యంలో ఇంటింటికి సీపీఐ(ఎం) కార్యక్రమం నిర్వహించి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్దతు ధర ప్రకటించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాలను అక్టోబర్ నవంబర్ మాసంలో ప్రారంభించాల్సి ఉండగా నేటికీ అవి ప్రారంభం కాకపోవడంతో రైతుల ఇళ్లల్లో పత్తి నిల్వలు పేరుకుపోయాయన్నారు. మధ్య దళారులు రైతుల అమాయకత్వాన్ని నిరక్షరాస్యతను ఆసరాగా చేసుకొని తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ తూకంలో మోసాలకు పాల్పడుతూ రైతులను నష్టాల పాలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కమిటీ సభ్యులు పోతరబోయిన సత్యనారాయణ,మహమ్మద్ ఖలీల్,బత్తిని భిక్షం,కొలిచెలిమ అబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.