Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ దీపక్ తివారి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో నిర్మాణంలో ఉన్న పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి అధికారులను ఆదేశించారు.బుధవారం కాన్ఫరెన్స్ హాలులో జరిగిన మన ఉరు -మన బడి పనుల సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె.నారాయణరెడ్డి, పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి ఆండాలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు పాల్గొన్నారు.