Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-ఆత్మకూరుఎస్
తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన యోధుడు బీఎన్ రెడ్డి అని ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి కొనియాడారు.మండలంలోని దాచారం గ్రామంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధుడు, మాజీ ఎంపీ భీంరెడ్డ్డి నర్సింహారెడ్డి శతదినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.తుమ్మలపెన్‌పహాడ్ క్రాస్‌రోడ్‌లో బీఎన్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.దాచారం గ్రామంలో బీఎన్ స్మారక గ్రంథాలయాన్ని ప్రారంభించారు.అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. తెలంగాణ సమాజం స్వేచ్చ గా ఉందంటే దానికి కారణం బీఎన్ పోరాట ఫలితమేనన్నారు.వితంతువును వివాహమాడిన ఆదర్శమూర్తి భీమిరెడ్డి నర్సింహారెడ్డి అన్నారు.అంతా అభిమానంతో బీఎన్‌గా పిలుచుకునే భీమిరెడ్డి నర్సింహారెడ్డికి తెలంగాణ చరిత్రలో ప్రత్యేక పుట ఉందని గుర్తుచేశారు.విసునూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్టికి వ్యతిరేకంగా చాకలి ఐలమ్మకు దన్నుగా నిలిచి తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా మలుపు తిప్పిన వ్యూహకర్త బీఎన్‌రెడ్డి అన్నారు.ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శం, స్ఫూర్తివంతం అన్నారు.రాజకీయంగా విభేదించినా బీఎన్‌ను అభిమానించే లక్షలాది మందిలో తానొక్కడినన్నారు.ఆయన స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లోకి వచ్చాన్నారు.తుంగతుర్తి, సూర్యాపేట ప్రాంతాలకు గోదావరిజలాలు తీసుకురావాలనే ఆయన చిరకాలవాంఛను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.ప్రాజెక్టులకు బీఎన్ పేరు నామకరణం చేసే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు.ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మెన్ గోపగాని వెంకటనారాయణగౌడ్, గ్రంథాలయ చైర్మెన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వె.వెంకటేశ్వర్లు,ఎంపీపీ స్వర్ణలతచంద్రారెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ కొణతం సత్యనారాయణరెడ్డి, మండలఅధ్యక్షులు తూడి నర్సింహారావు, ప్రధానకార్యదర్శి బత్తులప్రసాద్, మాజీ ఎంపీపీ బ్రహ్మం, శిల్పి శ్రీనివాస్‌రెడ్డి, బీఎన్ కుమారుడు ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.