Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా ఉద్యానవన అధికారి శ్రీధర్
నవతెలంగాణ-నూతనకల్
ఆయిల్ ఫామ్ సాగుతో రైతులు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన అధికారి బి.శ్రీధర్ తెలిపారు.బుధవారం మండలపరిధిలోని లింగంపల్లిలో రైతు పోనుగంటి జనార్దన్‌రావు నూతనంగా సాగు చేస్తున్న ఆయిల్ఫామ్ తోటను పరిశీలించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నాల్గో ఏడాది నుంచి దిగుబడి ప్రారంభమవు తుందన్నారు.ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందని తెలిపారు.మొదటి నాలుగేండ్లు అంతర పంటల ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చన్నారు. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం మొక్కలు సరఫరా చేస్తుందన్నారు.డ్రిప్పుకు, ఎరువులకు, అంతర పంటలకు రాయితీలు ఇస్తుందన్నారు.డ్రిప్ కోసం ఎస్సీ,ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ సన్న చిన్న కారు రైతులకు 90శాతం, ఇతర కేటగిరి రైతులకు 80శాతం రాయితీ ఇస్తుందన్నారు.ఎరువులు,అంతర పంటల యాజమాన్యానికి ఒక ఎకరానికి రూ.4200 చొప్పున మొదటి నాలుగేండ్లురాయితీ వస్తుందన్నారు. నమ్మకమైన నీటి వసతి గల రైతులు ఆయిల్ ఫామ్‌ను సాగు చేసి అధిక ఆదాయం పొందాలన్నారు.ఆసక్తి గల రైతులు ఉద్యాన శాఖ వారికి దరఖాస్తు చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో తుంగతుర్తి ఉద్యాన శాఖ అధికారి వి.స్రవంతి, రైతులు పోనుగంటి జనార్దన్‌రావు, కిరణ్, పతాంజలి ఫుడ్స్ లిమిటెడ్ ఫీల్డ్ అసిస్టెంట్ భద్రాచలం, డ్రిప్ ఇరిగేషన్ ప్రతినిధులు మల్లేష్, మోహన్ పాల్గొన్నారు.