Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -అర్వపల్లి
మండలంలోని జాజిరెడ్డిగూడెం మూసీ వాగు నుండి ఇసుక అనుమతి పేరుతో అక్రమంగా రవాణా చేయడాన్ని నిరసిస్తూ గురువారం గ్రామానికి చెందిన రైతులు, ప్రజలు మూసీ వాగు వద్ద రోడ్డుపై బైటాయించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, గ్రామస్తులు మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాను ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారన్నారు. ప్రభుత్వం నిర్మించిన బ్రిడ్జి కిందనే గుంతలు తొవ్వి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీ వాగు నుండి ఇసుక రవాణాను రాత్రి వేళలో కూడా పర్మిషన్ లేకుండా నిర్వహిస్తున్నారన్నారు దీనివల్ల బోర్లు అడుగంటిపోయాయన్నారు. వెంటనే అధికారులు మూసీ వాగు నుండి ఎటువంటి ఇసుకను రవాణా నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్చేశారు. ధర్నా నిర్వహిస్తున్న వద్దకు పోలీసులు చేరుకుని హైవే రహదారిపై ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని పక్కకు పిలిచి సంబంధిత అధికారులకు తెలియజేసి ఇసుక అక్రమ రవాణాను జరగకుండా చూస్తామన్నాని నచ్చజెప్పారు.