Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి
నవతెలంగాణ -ఆత్మకూర్ ఎం
బునాదిగాని కాలువ పనులను త్వరగా పూర్తి చేసి ఆత్మకూర్, మోటకొండూర్ మండలాల ప్రజలకు త్వరలోనేసాగునీరు అందిస్తానని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. రీచ్త్రీలో బునాదిగాని కాలువ పనులు అసంపూర్తిగా ఉండగా స్థానిక ఎమ్మెల్యే తన సొంత డబ్బులతో చేపట్టిన నిర్మాణ పనులను, గురువారం మండలంలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులను ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో బునాది గాని కాలువ నిర్మాణం పనులను కాంట్రాక్టర్లు నామమాత్రంగా నిర్వహించి నిధులను జమ చేసుకున్నారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలోని ధర్మారెడ్డి పిల్లాయిపల్లి, బునాదిగాని కాలువల మరుమత్తు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకమైన నిధులను మంజూరు చేసిందని తెలిపారు. కరోనా సందర్భంగా ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ఆలస్యం జరగడంతో కాంట్రాక్టర్లు కాలువ నిర్మాణ పనులను నిర్వీర్యం చేశారని చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు 2018 ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీని నెరవేర్చుట కోసం తన సొంత డబ్బులతో కాలువ నిర్మాణ పనులను చేపట్టామని త్వరలోనే నిర్మాణ పనులు పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజలకు తాగు, సాగు నీరు అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బిసు చందర్ గౌడ్ ఎంపిటిసి యాస కవిత సర్పంచ్ కోల సత్తయ్య రైతు సమన్వయ సమితి జిల్లా డైరెక్టర్లు బీసు ధనలక్ష్మి ,కోరే బిక్షపతి మండల కోఆర్డినేటర్ యాస ఇంద్రా రెడ్డి మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ మండల నాయకులు కే భాను ప్రకాష్, కే వెంకన్న ,ఎస్ అరుణ ,టి లక్ష్మి, వెంకన్న అబ్బాయిలు తదితరులు పాల్గొన్నారు.