Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చట్ట ప్రకారం విచారణ జరుగడం లేదు
- మహిళను రాత్రి వరకు విచారిస్తామంటే అది వేధించడమే, రాజకీయ కక్ష సాధింపే
- ప్రజా కోర్టులోనే బీజేపీకి బుద్ది చెప్తాం
- మంత్రి జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత విషయంలో ఈడీ పరిధిని మించి ప్రవర్తిస్తోందని, చట్ట ప్రకారం విచారణ జరుగడం లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. గురువారం సాయంత్రం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా తో మాట్లాడారు. మహిళను రాత్రి వరకు విచారిస్తాం అంటే అది ముమ్మాటికీ వేదించడమే, రాజకీయ కక్ష్య సాధింపు చర్య నే అని అన్నారు.బిజెపి పార్టీ నాయకుల ఆలోచనలు, స్టేట్ మెంట్ ఆధారంగానే ఈ.డి పనిచేస్తుంది అని విమర్శించారు.విచారణ సంస్థల పేరుతో బిజెపి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం సిగ్గు చేటని అన్నారు.రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులని బిజెపి ప్రభుత్వం వేధిసస్తుందన్నారు.కేంద్రంలో బీజేపీ వచ్చాక ఇలాంటి దుర్మార్గాలు పేట్రేగి పోతున్నాయని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విచారణ పేరుతో కవితను వేధిస్తున్నారని ఆరోపించారు.ఈ. డి అధికారులు మహిళల విచారణ చేసే క్రమం లో నిబంధనలు పాటించడంలేదన్నారు.కవిత ఎక్కడికి పారిపోవడం లేదని విచారణకు సహకరిస్తా అని చెప్పినా కూడా రాత్రి సమయం వరకు విచారించడం వేధించడమే అని ఆయన ధ్వజమెత్తారు. మహిళల హక్కులను గౌరవించాల్సింది పోయి చట్టంలో ఉన్న లోసుగులను అడ్డంపెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్న బీజేపీ దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టి బీజేపీ నుండి దేశాన్ని రక్షిస్తామని స్పష్టం చేశారు.బీజేపీ పార్టీ నాయకుల కను సన్నల్లో ఈడీ పనిచేస్తుందని విమర్శించారు. ప్రజా కోర్టులోనే బీజేపీ బుద్ది చెప్తామని హెచ్చరించారు.