Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి
నవతెలంగాణ-నకిరేకల్
దేశంలో మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కోరారు. గురువారం స్థానిక నర రాఘవరెడ్డి భవనంలో ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న వరంగల్‌లో జనచైతన్య యాత్ర ప్రారంభమై 28 వరకు కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు, మేధావులు యాత్రలో భాగస్వాములు కావాలని కోరారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల మాట్లాడుతూ మోడీ, అమిత్ షా నేతత్వంలో దేశాన్ని కార్పొరేట్ కంపెనీలకు, లక్షల కోట్లకు కట్టబెడుతూ నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలను చైతన్యం చేయడంలో ప్రతి కార్యకర్త చురుకుగా వ్యవహరించాలని కోరారు. సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ చిన్న వేంకులు అధ్యక్షుతన జరిగిన ఈ సమావేశంలో ఆ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకన్నగౌడ్, లూర్జు మారయ్య, పట్టణ కార్యదర్శి వంటేపాక వెంకటేశ్వర్లు, నాయకులు మర్రి వెంకటయ్య, మర్రి బక్కయ్య, సుధీర్, నాగయ్య, చిన్నబోయిన నాగమణి, పుట్ట సత్తయ్య, మల్లయ్య, పన్నాల శశికళ పాల్గొన్నారు.