Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పేపర్ లీకేజీపై సీబీసిఐడీతో సమగ్ర విచారణ జరిపించాలి
- ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ -భువనగిరిరూరల్
టీఎస్పీఎస్సీ చైర్మెన్ రాజీనామా చేయాలని డిమాండ్‌చేస్తూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మెన్ తక్షణమే రాజీనామా చేయాలని, సిట్‌తో కాకుండా సబీసీఐడితో విచారణ జరిపించాలన్నారు. పేపర్ లీకేజీ,చైర్మెన్,కార్యదర్శి, కమిషన్ సభ్యుల బాధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తుందనిన్నారు. కాన్ఫిడెన్షియల్ విభాగంలోకి ఇతర సెక్షన్లలో డ్యూటీ చేసే వ్యక్తులు,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎలా ప్రవేశించారో,యూజర్ ఐడీ,పాస్ వర్డ్ లు వారి చేతికి ఎలా వచ్చాయో, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పులిదిండి ప్రవీణ్ కుమార్ , నెట్వర్క్ మేనేజర్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి ల పాత్రపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బుగ్గ నవీన్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్ష కార్యదర్శలు ఈర్ల రాహూల్,చింతల శివ, పట్టణ నాయకులు నెలిగొండ సాయి,చిట్యాల విగేష్ ,హరీష్ పాల్గొన్నారు.