Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరణి సమస్యలను పరిష్కరిస్తాం
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తామని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో భువనగిరి జోడయాత్రలో భాగంగా పలు వార్డులో పర్యటించి, ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన పేదలకు సొంతింటి నిర్మాణానికి 5 లక్షల సాయం ,గృహ అవసరాలకు వాడుకునే వంటగ్యాస్ సిలిండర్ 500 , ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం, రైతుబంధు కౌలు రైతులకు వర్తింప చేస్తాం, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం, దళిత గిరిజనులకు పోడు భూములు అసైన్ భూముల పట్టాలను క్రమబద్ధీకరిస్తాం. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఉద్యోగ ఖాళీలను పూర్తిగా భారతీయ చేసి ఉద్యోగ క్యాలెండర్ అమర చేస్తాం, పంటలు నష్టపరిహారం అంచనా వేసి పరిహారం అందించి పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. భువనగిరి ఎమ్మెల్యే ఎ రోజు అసెంబ్లీలో నియోజవర్గ సమస్యలపై మాట్లాడలేదని, మూసి ప్రక్షాళన, ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య సేవలు తీసుకురావడంలో ఎమ్మెల్యే విఫలం చెందాడని ఆరోపించారు. బావి భారత ప్రధాని రాహుల్ గాంధీ జోడోయాత్ర స్ఫూర్తితో ఆయన అడుగుజాడలో, ఆయన స్ఫూర్తితో భువనగిరి నియోజకవర్గం లో జోడో యాత్రకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పోత్నాక్ ప్రమోద్ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మెన్ బర్రె జహంగీర్, పీసీసీ కమిటీ సభ్యులు తంగేళ్లపల్లి రవికుమార్, పట్టణ అధ్యక్షులు బిస్సుకుంట్ల సత్యనారాయణ, మండల అధ్యక్షుడు కోట స్వామి, నాయకులు కుక్క దువ్వు సోమయ్య, కౌన్సిలర్లు , పట్టణ నాయకులు పాల్గొన్నారు.