Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ -వలిగొండ రూరల్
గ్రామాలను అన్నిరంగాలలో సమగ్రా అభివృద్ధి పర్చడమే రాష్ట్ర ప్రభుత్వ లక్యం అని జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని వర్కటపల్లి, గొల్లేపల్లి, మొగిలిపాక గ్రామాలలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణా రెడ్డి నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. గోకారం,జాలుకాల్వ, గోళ్లేపల్లి గ్రామాలలో దివిస్ లేబరేటరీ వారి సౌజన్యంతో నిర్మించిన సీసీ రోడ్లను వారు ప్రారంభించి మాట్లాడుతూ గ్రామాలను సర్వతో ముఖాభివృద్ది పర్చడానికి ప్రభుత్వం కృషిచేస్తుందని, కేసీఆర్ ప్రవేశపెట్టే పలు సంక్షేమ పథకాలతో ప్రజలకు మరింత భరోసా కలుగుతుందని తెలిపారు. గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్,వైస్ ఎంపిపి బాతరాజు ఉమా బాల్ నర్సింహ, ఫైళ్ల రాజవర్డన్ రెడ్డి,సర్పంచులు గూడూరు శివశాంత్ రెడ్డి,ముద్దసాని శశికలా రెడ్డి, తుర్కపెళ్లి మాధవి సురేందర్, మీసాల శేఖర్, మద్దెల సందీప్, ఎంపిటిసి లు తుమ్మల వెంకట్ రెడ్డి, బెలిద సునీత నాగేశ్వర్,నాయకులు పడమటి మమత నరేందర్ రెడ్డి,ముద్దసాని కిరణ్ రెడ్డి, గూడూరు శ్రీధర్ రెడ్డి,గుర్రం లక్ష్మారెడ్డి,మొగుళ్ల శ్రీనివాస్,కీసర్ల సత్తిరెడ్డి, డేగల పాండు,సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.