Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- వలిగొండ రూరల్
మూసీ నది కింద ధర్మారెడ్డిపల్లి కాలువకు అడ్డంగా వేసిన పైపులను వెంటనే తొలగించి, కాలువ తూముకు గేటు ఏర్పాటు చేయాలని గోకారం సీపీఐ (ఎం) ఆధ్వర్యంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గారికి వినతిపత్రం అందజేశారు. ఈసందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య,మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మాట్లాడుతూ మూసీ నది కింద ధర్మారెడ్డిపల్లి కాలువ ధ్వారా సంగెం, వర్కట్ పల్లి,గోకారం గ్రామాలలోని వేల ఎకరాల భూమిలో వ్యవసాయాన్ని సాగు చేసేందుకు నీరు అందిస్తూ, గోకారం రామసముద్రం చెరువు గుండా ప్రక్క నియోజకవర్గంలోని వేల ఎకరాలకు సాగు నీరు అందేంచి కాలువ ఇదన్నారు. ఇంత ప్రాధాన్యం కల్గిన ఈ కాలువకు ధర్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఒకరిద్దరు రైతుల ప్రయోజనం కోసం కాలువకు అడ్డంగా పైపులు వేశారన్నారు. తధ్వారా రైతంగానికి సరిపడ నీళ్లు రావడం లేదని అందువలన చేతికి వచ్చిన వరి పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ శాఖ కార్యదర్శి కవిడే సురేష్, మాజీ సర్పంచ్ సిరిపంగి శ్రీరాములు, మాజీ ఎంపీటీసీ పబ్బు నారాయణ,సీపీఎం నాయకులు నారి రామస్వామిచెర్క వెంకటేష్,జంగయ్య,నల్లగంటి ముత్యాలు,మందుల యాదయ్య,కొండే నర్సింహా, నల్లగంటి యాదగిరి, పబ్బు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.