Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ సమగ్రంగా అభివృద్ధి పరచడమే తమ ధ్యేయమని ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 57 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అదేవిధంగా. పుట్టపాక గ్రామంలో 24 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం వల్లే మునుగోడు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి అందుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.40 కోట్ల తో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చౌటుప్పల్ లో ఇప్పటికే డయాలసిస్ సెంటర్ను ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయిస్తుందన్నారు. గ్రామాలలో అంతర్గత రోడ్ల నిర్మాణంలో భాగంగా సీసీరోడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి ప్రేమ్చందర్ రెడ్డి,జెడ్పిటిసి వీరమల్ల భానుమతి వెంకటేశం గౌడ్,సింగిల్ విండో చైర్మెన్లు జక్కిడి జంగారెడ్డి,దోడ యాదిరెడ్డి, పుట్టపాక ఎంపీటీసీ మర్రి వసంత, తహసీల్దార్ శ్రీనివాసరాజు,వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.