Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
మండల కేంద్రంలో హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారి అనుకోని శ్రీ కనకదుర్గ ఆలయం నుండి సంతోష్ నగర్ మీదుగా కొలనుపాక రోడ్డు, సిద్దిపేట వైపు వెళ్లే వాహనాలు, వెళ్లే క్రమంలో మూలమలుపు వద్ద వ్యవసాయ భావి రోడ్డుకు ఆనుకొని ఉండడంతో పలుమార్లు నవ తెలంగాణ దినపత్రిక వార్తలు ప్రచురించడం, సోషల్ మీడియాలో ప్రమాదాల నివారణ కోసం ముళ్లకాంచవేయాలని, సంబంధించి వాట్సాప్ లో పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ ఆధ్వర్యంలో పురపాలక సంఘ సిబ్బంది ప్రమాదాల నివారణ కోసం, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా గురువారం బావి వద్ద కంచె ఏర్పాటు చేయడంతో పాటు , కడీలు నాటారు. ఈ సందర్భంగా నవ తెలంగాణ దినపత్రికకు , పురపాలక సంఘ అధికారులకు పలువురు వాహనదారులు , పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ దినపత్రిక రిపోర్టర్ యేలుగల కుమారస్వామి, పురపాలక సంఘం సూపర్వైజర్ ఎలుగల శివ, పురపాలక సిబ్బంది వెంకటయ్య , ఎల్లయ్య ,నరసయ్య , పరశురాములు ,చిన్న రమేష్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.