Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మునగాల
ఈనెల 17 నుంచి 29 వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిర్వహించే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు పిలుపునిచ్చారు. గురువారం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో గోడ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొ రేట్ విధానాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం సాగే యాత్రలను విజయ వంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం మతవిద్వేశాలను రెచ్చ గొడుతుందని విమర్శించారు. తెలంగాణాలో కులాలు, మతాల మద్య చిచ్చు పెట్టి అధికారంలోకి రావాలని చూస్తుందని తెలిపారు. కార్పోరేట్ శక్తులకు లక్షల కోట్లు రూపాయలు కట్ట పెడుతూ ప్రజలపై భారాలు మోపుతుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ సాగుతున్న ఈ జనచైతన్య యాత్ర ఈనెల 25న సూర్యాపేట జిల్లాలోని కోదాడకు వస్తుందని చెప్పారు. ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు దేశిరెడ్డి స్టాలిన్‌రెడ్డి, బచ్చలకూర స్వరాజ్యం మండవ వెంకటాద్రి, వెంకన్న, నాగయ్య, గోపయ్య, ఉపేందర్, పాల్గొన్నారు.
మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలో గురువారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టుతున్న జనచైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ యాత్ర నేటినుంచి ఈనెల 29 వరుకు జరుగుతుందని నాయకులు తెలిపారు. పోస్టర్లను సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మాలోత్ బాలునాయక్, జిల్లా కమిటీ సభ్యులు భూక్య పాండు నాయక్, సీనియర్ నాయకులు ఎస్.జగన్ మోహన్‌రెడ్డి, సీఐటీయూ మండల కన్వీనర్ సయ్యద్ రన్ మియా, పొడిచెట్టి రాము, ప్రభు దాసు, సైదమ్మ, నాగమణి, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.
గరిడేపల్లి : ఈనెల 17 నుంచి 29 తేదీ వరకు నిర్ణయించే సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో చేపట్టే జన చైతన్య యాత్రను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నగర పాండు కోరారు. మండల కేంద్రంలోని ఎమ్మెస్ భవనంలో నిరహించిన ఆ పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పల్లె వెంకటరెడ్డి, మండల కార్యదర్శి షేక్ యాకూబ్, దోసపాటి భిక్షం, యానాల సోమయ్య, అంబటి బిక్షం, నందిపాటి మట్టయ్య, వెంకటప్పయ్య, బొల్లెపల్లి శీను, నందిపాటి నాగయ్య, వెంకన్న, సైదిరెడ్డి పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : బీజేపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకించాలని సీపీిఐ(ఎం) మండల కార్యదర్శి రణపంగ కృష్ణ విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలోని భక్తాలపురం, దూపహడ్, చీదేల్ల, ధర్మపురం గ్రామాలలో ఈ నెల 17 నుండి 29 వరకు జరిగే జన చైతన్య యాత్ర పోస్టర్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు గుంజ వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు నెమ్మాది అడిమయ్య, బొమ్మిరెడ్డి గోపిరెడ్డి, శాఖ కార్యదర్శి పీరయ్య, ఉపసర్పంచ్ సుజాతసైదులు, సుమీల, ఉదయశ్రీ, పద్మ, మురళి, ఉదరు, ముత్తయ్య, బాబు, వెంకట్. తదితరులు పాల్గొన్నారు.
నేరేడుచర్ల : బీజేపీి మతోన్మాద కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మతసామరస్యం, ప్రజాస్వామ్య సామాజిక న్యాయం కోసం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఈనెల 17 నుండి 29 వరకు జరుగు జన చైతన్య యాత్ర జయప్రదం చేయాలని ఆ పార్టీ నేరేడుచర్ల టౌన్ కార్యదర్శి కొదవగల నగేష్ కోరారు. గురువారం స్థానిక సిపిఎం కార్యాలయం అరిపండి భవన్లో జనచైతన్య యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ నాయకులు కుంకు తిరుపతయ్య ,అనేగంటి మీనయ్య, నీలా రామ్మూర్తి , శ్రీను ,ఎస్.కె ఆఫీస్ గుర్రం ఏసు కోదాటి సైదులు, కొండ లింగయ్య ,తదితరులు పాల్గొన్నారు.
సూర్యాపేట : కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 17 నుంచి 29 వరకు జరిగే జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) వన్ టౌన్ కార్యదర్శి వల్లపు దాస్ సాయికుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ఏడవ వార్డులో బస్సు యాత్ర పోస్టర్ ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ చైతన్య యాత్రలు కొనసాగుతాయని తెలిపారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటం భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం చేసిన పోరాటం స్ఫూర్తి గా కార్మికులు ,ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాచూరి జానకి రాములు, మామిడి సుందరయ్య ,రాచూరి లక్ష్మి, నల్ల మేకల రాజమ్మ, శేఖర్, మామిడి రేణుక, సైదులు, మంగయ్య ,నాగరాజు, నరసమ్మ, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.